ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeతెలంగాణపాకాల సరస్సులో విషాదం... ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

పాకాల సరస్సులో విషాదం… ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

పాకాల సరస్సులో విషాదం…

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య

ఖానాపురం నవంబర్ 7(నమస్తే భారత్ ) :

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి సరస్సులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన మమత, అదే గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్‌ను కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా భర్త సుమన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.వారం రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ కుటుంబ కలహాలు సద్దుమణగలేదని సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన మమత(30) తన ఇద్దరు పిల్లలు హారిని(6), హారిక (4)లు
కలిసి శనివారం ఉదయం పాకాల సరస్సుకు చేరుకుంది. టికెట్ తీసుకుని బోటింగ్ ప్రాంతానికి వెళ్లిన ఆమె అక్కడే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

*పాఖాల సరస్సు ఘటనలో కొనసాగుతున్న పోలీసుల విచారణ*

పాఖాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి మమత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, కుటుంబ కలహాల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు.గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన మమత తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి పాకాల సరస్సులో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. భర్తతో కుటుంబ కలహాలే ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.ఘటనకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, దుగ్గొండి సీఐ శంకరయ్య, ఖానాపురం ఎస్‌ఐ రామ్మోహన్ ఇప్పటికే వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తూ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
పోలీసుల విచారణ పూర్తయితే ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!