ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeతెలంగాణ*చించోడు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన*

*చించోడు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన*

📰 Generate e-Paper Clip

*చించోడు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన*

*డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి*
*రంగారెడ్డి జిల్లా వైద్య అధికారి*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31: రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి షాద్ నగర్ డివిజన్ ఫరూక్నగర్ మండల్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న హెల్త్ ఎడ్యుకేటెడ్ జె. శ్రీనివాసులతో మాట్లాడుతూ చించోడు ఆసుపత్రిలో ఎంతమంది రెగ్యులర్ స్టాప్ మరియు కాంట్రాక్ట్ స్టాఫ్ పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ నర్స్ వినీతతో మాట్లాడుతూ , ఈరోజు ఎంత ఓ.పి చూశారు..?, అందులో ఎంతమందికి బ్లడ్ పరీక్షలకు రిఫర్ చేశారని అడిగి తెలుసుకున్నారు. తదుపరి వెంటనే ల్యాబ్ ను పరిశీలించి అందులో ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్ తో మాట్లాడి, అతను ఏ ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు అడిగి, అతని యొక్క ల్యాబ్ రిజిస్టర్ను వెరిఫై చేశారు. ఇక్కడ టీ.బి స్ఫుటం పరీక్షలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఫార్మసిస్ట్ పర్వతాలు తో మాట్లాడుతూ అతను గర్భవతులకు మరియు చిన్న పిల్లలకు ఇచ్చే టీకాల ఇంజక్షన్లను ఐఎల్ఆర్ లో, ఓల్డ్ చైన్ ఎలా మైంటైన్ చేస్తున్నారో పరిశీలించారు. కోల్డ్ చైన్ మిషన్ లో టెంపరేచర్ రిజిస్టర్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. తదుపరి ఆఫీసులో నీ స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ ను మరియు మూమెంట్ రిజిస్టర్ లను పరిశీలించారు. మూమెంట్ రిజిస్టర్ ఈ వారంలోని టూర్ ప్రోగ్రామ్ను అప్డేట్ చేసుకోమని తెలియజేశారు. కాంట్రాక్టు డి ఈ ఓ ఈరోజు ఆబ్సెంట్ అయినందుకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వమని తెలియజేశారు. స్టాఫ్ నర్స్ వినీతకు కు ఆస్పత్రి కాన్పులను పెంచమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిపిఓ అక్రమ్, డి ఎం ఎం హెచ్ ఓ సి సి సురేష్, చించోడు పీహెచ్సీ హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీ రామ, ఫార్మసిస్ట్ పర్వతాలు, స్టాఫ్ నర్స్ వినీత , ల్యాబ్ టెక్నీషియన్ అశోక్ మరియు కాంటిజెంట్ వర్కర్ మణెమ్మ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!