*షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లీబిడ్డ మృతి!*
*వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని – సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ -షాద్ నగర్ టి ఆర్ పిఇంచార్జి ఎమ్మె సంతోష్*
నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31:షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన నిండు గర్భిణీ తల్లి బిడ్డలను ప్రభుత్వ వైద్యుల హత్యను ఖండిస్తూ, నిర్లక్ష్యానికి కారకులైన కొందుర్గ్ మరియు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు చట్టపరమైన శిక్ష విధించాలని డిమాండ్ చేసిన షాద్ నగర్ TRP ఇంచార్జి ఎమ్మె సంతోష్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షాద్ నగర్ లో జరిగిన ఈ దారుణాన్ని ఒక నిండు గర్భిణీ మహిళను మరియు చిన్నారి పసికందు బలిగావడం చాలా అన్యాయమని కొందుర్గు మండలంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన రాధా అనే దళిత మహిళా గర్భిణీ ప్రసవం కోసం నొప్పులు రావడంతో కొందుర్గు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వారు నిర్లక్ష్య ధోరణితో షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా చెప్పడంతో అప్పటికే తీర్వమైన నొప్పులతో తల్లడిల్లుతున్న ఆ గర్భిణీ స్త్రీని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోగా వాళ్లు కూడా అదే నిర్లక్ష్య ధోరణితో హైదరాబాద్ వెళ్ళమని చెప్పడంతో డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రిలో నెలల వారిగా చికిత్స పొందుతూన గర్భిణీలు అత్యవసర మరియు ప్రసవ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయకుంటే వారు ఎక్కడికి వెళ్లాలని అదే మొదటి నుండి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసుకుంటే ఈరోజు ఈ దారుణం జరిగే పరిస్థితి ఉండేది కాదని ఒక చిన్న ప్రైవేటు ఆసుపత్రి కూడా అత్యవసర చికిత్స మరియు ప్రసవాలు సురక్షితంగా చేస్తుంటే పేరుకు పెద్ద ఆసుపత్రిగా చలామణి అవుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్సకు డాక్టర్లు ఉండరు మందులు ఉండవు మరియు ఆ చికిత్సకు సంబంధించిన పరికరాలు ఉండవు ఇది కేవలం ప్రభుత్వాలు ప్రైవేటు వ్యవస్థను పెంచి పోషించడానికి మరియు నిరుపేద లు వారి యొక్క ఆస్తుల అమ్మి చికిత్స చేసుకోవాల్సిందిగా కొందరు ప్రజలకు సేవ చేయాల్సిన పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు సొంతంగా ప్రైవేటు దావకానాలను పెట్టుకొని వైద్యాన్ని అమ్ముకుంటుంటే ప్రభుత్వలు వాటికి వత్తాసు పలుకుతూ పేదల ప్రాణాలు బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం మేము గతంలోనే కొందుర్గు దావఖాన నరకానికి కేరాఫ్ అడ్రస్ అని ఆ దావఖానకు అత్యవసర చికిత్స కు వెళ్ళిన ప్రతి ఒక్కరు ప్రాణాల పైన ఆశ వదులుకోవాలని నిరాహార దీక్ష కూడా చేయడమైనది మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఫాదయాత్ర కొందుర్గు మీదుగా వెళ్లే సందర్భంలో కొందుర్గు ప్రభుత్వ వైద్యశాల కనీస వసతులు లేవు మరియు శిథిలా వ్యవస్థలో ఆసుపత్రి అలాగే కనీసం రోగులకు కావలసిన మందులు చికిత్స సంబంధించిన పరికరాలు అత్యాసర వైద్యులు లేరని ఆ వైద్యశాలను కూడా తీన్మార్ మల్లన్న గారు సందర్శించడం జరిగిందని సమస్యలపై వైద్యులను నిలదీయడమైనది అయినా ఇప్పటికీ ఏ మార్పు లేదని గతంలో కూడా కొందరు పాముకాటుకు మరికొందరు యాక్సిడెంట్ల వల్ల మరియు గర్భిణీలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక చావులకు కేరాఫ్ అడ్రస్సు ప్రభుత్వ దావకానలేని అక్కడ ఉన్న కొరతవల్లేనని ఇప్పటికైనా ప్రభుత్వాలు వైద్యం సంబంధించి నిధులు, నియామకాలు చేపట్టి ప్రభుత్వ దావఖానాలను నరక కూపములో నుండి బయటకు తీసుకురావాలని డిమాండ్ చేయడమైనది అదే విధంగా ప్రస్తుతం రాధా ఆనే గర్భిణీ మహిళ మరియు కడుపులో బిడ్డ మరణం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిర్లక్ష్యానికి కారకులైన కొందుర్గ్ మరియు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు చట్టపరమైన శిక్ష విధించాలి భవిష్యత్తులో ఇట్లాంటి మరణాలు పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంపై స్పందించి అత్యవసర వైద్యులను మందులను మరియు చికిత్సకు సంబంధించిన పరికరాలను మిషిన్లను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేయడమైనది.
లేనియెడల రాష్ట్ర నాయకత్వం తీన్మార్ మల్లన్న గారి ఆదేశాలతో షాద్ నగర్ TRP ఆధ్వర్యంలో భారీ ధర్నా. మరియు నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించడమైనది.
కొందుర్గ్ మండల చెరుకుపల్లి గ్రామానికి చెందినా SC కుల మలని రమేష్ కుమార్ భార్య రాధా అనె ఓ దళిత గర్భిణీ మహిళ, కడుపులోని బిడ్డతో సహా మృత్యువాత పడిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రికి బలి అయిన ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యు లారా మీ నిర్లక్ష్యం తో కడుపులో పసిబిడ్డ, ఆ బిడ్డను మూసే తల్లిని ఇద్దరిని చంపింది మీరే మరియు ఈ రాష్ట్ర ప్రభుత్వమని ఇది ముమ్మాటికి దారుణమని ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన వ్యక్తుల్లో కేవలం మా బిడ్డలైన ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ లు ఉండడం అత్యంత బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు
ఈ ప్రభుత్వ ఆస్పత్రి మరియు ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి నిరసిస్తూ ప్రతిపక్షానాయకులు, పార్టీలు, మరియు ప్రజలు ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం లో అండ గా నిలువాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో షాద్నగర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుల్ల లక్ష్మి, కొందుర్గు మండల అధ్యక్షులు దర్గ వెంకటయ్య, జిల్లా నాయకులు జి.శ్రీనివాసులు, షాద్ నగర్ మున్సిపాలిటీ అధ్యక్షులు రాములు, నియోజకవర్గ నాయకులు గుంటి శంకర్, ఫరుక్ నగర్ మండల్ అధ్యక్షులు ఆవ జగన్, యాదగిరి వడ్డే శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.



