ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeఎడిటోరియల్కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం బుద్దుల జంగయ్య

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం బుద్దుల జంగయ్య

📰 Generate e-Paper Clip

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం
బుద్దుల జంగయ్య

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31:కార్మిక హక్కులను కాలరాస్తూ బడా పెట్టుబడిదారులైన
ఆదాన్ని అంబానీ బడ పారిశ్రామికవేతులకు ఉడియం చేస్తుంది కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు జిల్లా
ప్రధాన కార్యదర్శి
బుద్ధుల జంగయ్య ఆరోపించారు కొందుర్గు మండలం కేంద్రంతో పాటు రామచంద్రపూర్ చౌరస్తాలో ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య తిధి గా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ అట్టడుగు కార్మిక వర్గాలైన గ్రామపంచాయతీ కార్మికులు ఆశ వర్కర్ అంగన్వాడీలు మధ్యాహ్న భోజన కార్మికులు తదితర రంగాలకు కనీస వేతనం లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు వారితో వ్యక్తి చాకిరి చేయించుకుని అంగన్వాడీలు రిటైర్మెంట్ అయిన తర్వాత కనీస పెన్షన్ సౌకర్యాన్ని కూడా నోచుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు 44 లేబర్ చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి అమలుపరుస్తుంది కేంద్ర ప్రభుత్వమన్నారు సంఘం పెట్టుకునే హక్కును కూడా లేకుండా చేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటుపరం చేసి ఇదే అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధంగా వలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా కార్మిక లోకానికి పిలుపునిచ్చారు రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం హక్కులకై ఉద్యమిద్దమని నినదించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి భాగాల నరసింహ జిపి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు జి యాదయ్య ప్రధాన కార్యదర్శి పామిడి జంగయ్య కార్యనిర్వాహక కార్యదర్శి సి జంగయ్య కోశాధికారి ఎం శ్రీను నాయకులు అధ్యక్షులుయాదయ్య రాములు జంగమ్మ చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!