ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeఎడిటోరియల్*సార్ పేరిట ప్రజాస్వామ్య హత్య – కేంద్రం కుట్రలను తిప్పికొడతాం*

*సార్ పేరిట ప్రజాస్వామ్య హత్య – కేంద్రం కుట్రలను తిప్పికొడతాం*

📰 Generate e-Paper Clip

*సార్ పేరిట ప్రజాస్వామ్య హత్య – కేంద్రం కుట్రలను తిప్పికొడతాం*

*​13 కోట్ల ఓట్ల తొలగింపుపై ఏ ఐ ఎస్ ఎఫ్ఆగ్రహజ్వాల.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి*

*​షాద్‌నగర్‌లో కళ్లకు నల్లరిబ్బన్లతో విద్యార్థుల మహా ధర్నా!*

*​ఓటు హక్కుపై దాడి చేస్తే సహించేది లేదు.. సార్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలి*

*​140 కోట్ల జనాభాలో 13 కోట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడమే*

*​షాద్‌నగర్ అంబేద్కర్ చౌరస్తాలో మోగించిన ఏ ఐ ఎస్ ఎఫ్ సమరశంఖం*
​
*​ప్రజాస్వామ్యం అమ్మకానికి లేదు జ్ఞానేశ్ కుమార్ గద్దె దిగాల్సిందే*

*ఓటు హక్కును కాలరాస్తున్న ‘సార్ విధానానికి వ్యతిరేకంగా ఏ ఐ ఎస్ ఎఫ్ పోరుబాట*
*​షాద్‌నగర్ వీధుల్లో హోరెత్తిన నిరసన ర్యాలీ*

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్*

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్31:దేశంలో రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక ఓటు హక్కును తీవ్రంగా హరించేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుట్రపూరితంగా చేపట్టిన (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ షాద్‌నగర్ సమితి డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమై, కోట్ల మంది ఓట్లను హరిస్తున్న ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టింది.
​ఈ క్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ షాద్‌నగర్ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు తమ కళ్లకు నల్లబ్యాండ్‌లు ధరించి, చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అంబేద్కర్ ముఖ్యకూడలి చౌరస్తా నుండి మహనీయుల విగ్రహాల వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

​140 కోట్ల జనాభాలో 13 కోట్లు ఓట్లు తొలగిస్తారా?

ఈ కార్యక్రమానికి ఫరూక్ నగర్ మండల కార్యదర్శి అనిల్ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి చౌహాన్ నాయకత్వం వహించగా, ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… “దేశంలోని 140 కోట్ల జనాభాలో ఏకంగా 13 కోట్ల మంది ఓటు హక్కును అన్యాయంగా రద్దు చేయడం ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా తుంగలో తొక్కడమే. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై పేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించడం దారుణం. ఓటు హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దానిని కాలరాసే అధికారం ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యం అమ్మకానికి లేదు (డెమోక్రసీ ఇస్ నాట్ ఫర్ సేల్ ). కేంద్రం వెంటనే SIR ప్రక్రియను రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన పోరాటాలను ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు.
​ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు, నరేష్, శ్రీహరి, రాజేష్, రాకేష్, రాఘవేందర్, బన్నీ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!