ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeఎడిటోరియల్సూరవరం సుధాకర్ రెడ్డి మహా త్యాగశీలి బుద్ధుల జంగయ్య

సూరవరం సుధాకర్ రెడ్డి మహా త్యాగశీలి బుద్ధుల జంగయ్య

📰 Generate e-Paper Clip

సూరవరం సుధాకర్ రెడ్డి మహా త్యాగశీలి బుద్ధుల జంగయ్య

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 22:సిపిఐ జాతీయామాజీ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారు మహా గొప్ప త్యాగశీలి అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్దుల జంగయ్య
కొని ఆడారు ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కొందుర్గు మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి జీవితం నేటి కమ్యూనిస్టు నాయకులకు ఆదర్శప్రాయమని అన్నారు కార్యకర్తల పట్ల కమ్యూనిస్టు నాయకుల పట్ల ఆయన ఎంతో ప్రేమ అభిమానాలతో ఉండేవారని తెలియజేశారు ప్రజా సమస్యలపై పార్లమెంటు లోపల బయట ఎన్నో పోరాటాలు నిర్వహించిన మహాయోధులు సురవరం సుధాకర్ రెడ్డి ని అన్నారు ఆయన జీవితకాలం కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రజా పోరాటాలకి అంకితం చేశారని తను మరణించి కూడా భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా ఉండాలని ఉద్దేశంతో తన పార్థక దేహాన్ని గాంధీ ఆసుపత్రికి మెడికల్ విద్యార్థుల చదువుల కోసం దానం చేశారంటే నేను చనిపోవచ్చు కానీ నా శరీరం మెడికల్ విద్యార్థుల చదువుల కోసం ఉపయోగపడాలని ఉద్దేశంతో నా శరీరంపై మెడికల్ విద్యార్థులు పరిశోధించి నేర్చుకొని భవిష్యత్తులో ఈ దేశానికి ఓ గొప్ప డాక్టర్లుగా తయారయ్యి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన దేహాన్ని గాంధీ మెడికల్ ఆసుపత్రికి ఇవ్వటం అనేది ఓ గొప్ప సంకల్పమని అలాంటి సంకల్పాన్ని తన జీవితంలో నెరవేర్చుకున్న మహానీయుడు సురవరం సుధాకర్ రెడ్డి గారిని అతని ఆశయాలను భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలు పిలిపించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లేడు చౌదరిగుడా మండల కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు జిల్లెల్ల వెంకటేష్ నాయకులు పిజంగయ్య
సి జంగయ్య బి యాదయ్య ఎండి రఫీ రాములు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!