ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeఎడిటోరియల్పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

📰 Generate e-Paper Clip

*పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి*

*షాద్‌నగర్‌లో ఆర్ డి ఓ కార్యాలయం ముట్టడి విద్యార్థుల ఆందోళన*

*ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్*

*ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్*

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్22:షాద్‌నగర్ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, విద్యార్థుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ఆర్డిఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని “పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి – విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి” అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
విద్యార్థుల ఆందోళన కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి తరలించారు. అనంతరం ఆర్డిఓ స్వయంగా విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యలను విన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఎలాంటి నిర్ణయాలను విద్యార్థి సంఘాలు అంగీకరించబోవని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలని డిమాండ్ చేశారు.పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించే వరకు విద్యార్థుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు.. పాలిటెక్నిక్ విద్యార్థి, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఏఐఎస్ఎఫ్ & ఎస్ఎఫ్ఐ

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!