మాదిగ సమాజం ఆర్థిక అసమానతలను అధిగమించాలి

వరంగల్ , ఆగస్టు 22 (నమస్తే భారత్ ) :
మాదిగ సమాజం ఆర్థిక అసమానతలను అధిగమించాలని మాదిగ సంక్షేమ పరిషత్ జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జి వంగూరి ఆనంద్ రావు అన్నారు.పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో లక్ష్మీపురం కమిటీ హాల్ లోమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ సంక్షేమ పరిషత్ అనుబంధ సంఘాల మండల సదస్సు నిర్వహించారు.ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ వరంగల్ మండల ఇంచార్జీ కన్నెబోయిన ప్రమోద్ మాదిగ అధ్యక్షతన తూర్పు నియోజకవర్గ ఇంచార్జి గంగారపు మల్లన్న మాదిగ సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ పరిషత్ జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జి వంగూరి ఆనంద్ రావు మాదిగ, మాదిగ సంక్షేమ పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి ప్రణయ్ దీపు మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాజీ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ హాజరై వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సాగుతున్న ఆత్మగౌరవ ఉద్యమం, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలను వివరించారు. సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
*మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మండల కమిటీ*
మండల అధ్యక్షులుగా : ఐత చంద్రమౌళి మాదిగ,అధికార ప్రతినిధి: చింత సతీష్ మాదిగ,ప్రధాన కార్యదర్శి: మోలుగురి శ్యామ్ మాదిగ,ప్రధాన కార్యదర్శి-2: ఇసంపెల్లి ప్రశాంత్ మాదిగ,ఉపాధ్యక్షులు: దౌడు నరేష్ మాదిగ,జన్ను కరుణాకర్,మామునూరి అనిల్ మాదిగ,సంక్షేమ పరిషత్ మండల కమిటీ:అధ్యక్షులు: వశపోతుల శ్రీనివాస్ మాదిగ,అధికార ప్రతినిధి: ఇసంపెల్లి బాబురావు మాదిగ,ప్రధాన కార్యదర్శి: ముత్యాల రవి మాదిగ,ఉపాధ్యక్షులు: కవ్వంపల్లి రవి మాదిగ, రాషపెల్లి అశోక్,జన్ను నాని,కార్యదర్శి: బిర్రు కొమురయ్య,సహాయ కార్యదర్శి: పుల్ల అంజిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వరంగల్ మండల నూతన కమిటీ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు, కార్యకర్తలకు ఐత చంద్రమౌళి మాదిగ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని సంఘం బలోపేతానికి, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తానని తెలిపారు.



