ePaper
Thursday, August 27, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!

ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!

📰 Generate e-Paper Clip

ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగు రాము ముందడుగు..!4వ వార్డులో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు

నమస్తే భారత్ :-​మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి స్థానిక నేత మెరుగు రాము ప్రత్యేక చొరవ చూపారు. వార్డు పరిధిలోని గోపాలపురం కాలనీలో నెలకొన్న సమస్యలపై ఆయన తక్షణమే స్పందించారు.
​పారిశుద్ధ్య పనులు: గోపాలపురం కాలనీ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలగించి, మురుగు కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించారు.​వీధి దీపాలకు మరమ్మతులు: వార్డులో గత కొద్ది రోజులుగా వెలగకుండా ఉన్న సుమారు 30 వీధి లైట్లకు స్వయంగా మరమ్మతులు చేయించి, వీధులన్నీ తిరిగి వెలుగులు జిమ్మేలా.చర్యలు.తీసుకున్నారు.​కాలనీని పరిశుభ్రంగా మార్చడంతో పాటు, రాత్రి వేళల్లో చీకటి సమస్యను పరిష్కరించడంపై 4వ వార్డు, గోపాలపురం కాలనీ ప్రజలు మెరుగు రాము కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వార్డు అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎల్లవేళలా ముందుంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!