ePaper
Thursday, August 27, 2026
ePaper
Homeఎడిటోరియల్బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే

📰 Generate e-Paper Clip

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సిందే

అఖిల భారత యువజన సమాఖ్య గార్ల మండల మహాసభలో సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్

జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ డిమాండ్

నమస్తే భారత్ :-తొర్రూర్

అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తొర్రూర్ మండల మహాసభ లయన్స్ భవనంలో బూర్గు వీరేశం అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన అఖిలభారత యువజన సమాఖ్య సిపిఐ తొరూరు మండల కార్యదర్శి బందు మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ మాట్లాడుతూ మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడని విభజన హామీ చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు నాణ్యత లేదని దాత వేస్తున్నారని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మహబూబాబాద్ జిల్లా ప్రజలకు సుమారు 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్ర హక్కులను ఢిల్లీలో అడగడంలో పూర్తిగా విఫలమయ్యారని రానున్న కాలంలో అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఉధృతం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఉద్యమం చేస్తామన్నారు
ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 27న అఖిలభారత యువజన సమైక్య జిల్లా మహాసభ మహబుబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతుందని ఈ మహాసభకు గార్ల మండలం నుంచి యువతీ యువకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం తొర్రూర్ మండల ఏఐవైఎఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బూర్గు వీరేష్ ,పెరబోయిన క్రాంతికుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..మొత్తం 9 మందితో కమిటీ వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గణపురం లక్ష్మణ్, పేరబోయిన కిరణ్ కుమార్, తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కోటగిరి యాకాంతం శివప్రసాద్, పత్తి శివ, ఎడెల్లి మురళి, లోకేష్, బానోత్ రమేష్ ఉదయ్,రాంబాబు, వేణు,శ్రీకాంత్,అనిల్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!