పోతుల కాంతమ్మ మృతి.. కుటుంబ సభ్యులకు పరామర్శ తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన సీనియర్ రిపోర్టర్ పోతుల గోవర్ధన్ తల్లిగారైన పోతుల కాంతమ్మ (85) వృద్ధాప్య కారణాలతో ఆదివారం మృతి చెందారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాత్రికేయులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డితో కలిసి పోతుల కాంతమ్మ భౌతికకాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భౌతికకాయానికి పూలమాల వేసి.ఘనంగా.నివాళులర్పించారు. అనంతరం పోతుల గోవర్ధన్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.పోతుల కాంతమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని, వృద్ధాప్యంలో ఆమె మృతి చెందడం బాధాకరమని ప్రగతి శ్రీపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో కౌన్సిలర్ జాటోతు సురేష్, కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, డీసీసీ మెంబర్ కుడితి నరసింహరెడ్డి, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, దేవరశెట్టి లక్ష్మినారాయణ, కుడితి వెంకట్ రెడ్డి, ముదిరెడ్డి లక్ష్మారెడ్డి, పడిదం రాధిక, పొన్నం వినయ్, దూగుంట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు .



