ePaper
Saturday, July 11, 2026
ePaper
Homeఎడిటోరియల్జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. వంద శాతం విజయవంతం చేయాలి: 

జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. వంద శాతం విజయవంతం చేయాలి: 

📰 Generate e-Paper Clip

జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. వంద శాతం విజయవంతం చేయాలి:

వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) లో గురువారం ఆశా (ఆశ ) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి నేతృత్వంలో రాబోయే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (నేషనల్ డెవర్మింగ్ డే ) పై ముందస్తు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ. మండలంలోని 1 నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. కడుపులో నులిపురుగుల చేరడం వల్ల పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపానికి గురవుతారని, దీనివల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుందని హెచ్చరించారు.
వయస్సు వారీగా మాత్రల మోతాదు వివరాలు:

* 1 నుండి 2 సంవత్సరాల పిల్లలకు: సగం ఆల్బెండజోల్ మాత్రను పొడి చేసి నీటితో ఇవ్వాలి.
* 3 నుండి 19 సంవత్సరాల పిల్లలకు: పూర్తి ఆల్బెండజోల్ 400 mg మాత్రను ఇచ్చి, నమిలి మింగేలా చూడాలి.

ముఖ్యమైన తేదీలు:

* జూలై 13, 2026 (నేషనల్ డివర్మింగ్ డే): మొదటి విడతగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో మాత్రల పంపిణీ జరుగుతుంది.
* జూలై 20, 2026 (మొప్-అప్ డే -మొదటి విడతలో వివిధ కారణాల వల్ల మాత్రలు వేసుకోలేకపోయిన మిగిలిన పిల్లలందరికీ ఈరోజు తప్పనిసరిగా మాత్రలు అందిస్తారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్ సాగర్, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, హెల్త్ సూపర్‌వైజర్లు ఆచార్యులు, లక్ష్మి కుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది ఝాన్సీ, అనిత, ఉపేంద్ర, సతీష్, అఖిల, మండల పరిధిలోని లు మరియు ఆశా ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 13 మరియు 20 తేదీల్లో క్షేత్రస్థాయిలో ప్రతీ ఇంటిని సందర్శించి వంద శాతం మంది పిల్లలకు మాత్రలు అందేలా చూడాలని ఆశా కార్యకర్తలను వైద్యాధికారి ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!