ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు   ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలోని బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు   ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలోని బంద్ విజయవంతం.

📰 Generate e-Paper Clip

ఎస్ఎఫ్ఐ, పి డి ఎస్ యు ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలోని బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతిబసు,పిడిఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు రాచకొండ ఉదయ్

డివైఎఫ్ఐ, కెవిపిఎస్ నాయకుల మద్దతు.

నమస్తే భారత్ :-మరిపెడ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా మరిపెడ మండల కేంద్రంలోని బంద్ నిర్వహించి అనంతరం బస్టాండ్ నుంచి కార్గిల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు జిల్లా నాయకులు గంధసిరి జ్యోతిబసు, రాచకొండ ఉదయ్ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం మొదలై నెల పై గడుస్తున్నా నేటికీ ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్, విద్యార్థి కిట్టు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై నిర్లక్షం చేస్తుందని మండిపడ్డారు, 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేలకు కుదించాలనే ప్రభుత్వ ఆలోచనని మానుకోవాలని, విద్యాశాఖ మంత్రిని నియమించాలని,మరిపెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, మరిపెడ/బంగ్లా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగవంతం చేయాలని, మధ్యాహ్న భోజనాన్ని వండించే బాధ్యత డ్వాక్రా, మహిళా గ్రూపులకు అప్పజెప్పాలని, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని , ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డోర్నకల్ నియోజకవర్గం లోని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లేనియెడల విద్యార్థులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బందుకు ప్రజా సంఘాలు కేవిపిఎస్, డివైఎఫ్ఐ యువజన సంఘాలు మద్దతు ఇచ్చాయి ఈ కార్యక్రమంలో కెపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్న లచ్చన్న, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు.మధుసుదన్,ఎస్ఎఫ్ఐ మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు బాణాల గోపి, పెద్దపులి బాసు, నాయకులు వంశీ, అరుణ, స్వర్ణ, సుష్మ,పి డి ఎస్ యు నాయకులు రోహిత్, నందు, గణేష్, కమల్, కిట్టు, అనిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!