ఆలయ సాంప్రదాయాలను మార్చడం సరికాదు
నమస్తే భారత్ :-తొర్రూరు
పాలకుర్తి నియోజకవర్గం లో ఉన్న శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవస్థాన ఆలయ సాంప్రదాయాలను మార్చడం సరికాదని పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసు రామచంద్రయ్య శర్మ అన్నారు. మంగళవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న హరిహరుల దివ్య క్షేత్రమైన స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేలాదిమంది భక్తులు స్వామివారిని.దర్శించుకుంటున్నారని, శివ కేశవులకు భేదం లేదనేది ఈ క్షేత్రం తెలియజేస్తుందని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహా శివరాత్రి రోజున శివపార్వతులతో పాటు లక్ష్మీనరసింహస్వామి వారికి కల్యాణ కళ్యాణం జరగడం విశేషమని, ఈ దేవస్థానానికి శివ భక్తులతో పాటు విశ్వక్తులు వారి స్వార్ధ ప్రయోజనాలకు తలయం ఉద్భవించిన నేటి నుంచి ఆచరిస్తున్న వైదిక దీనికి స్మార్త అగమ సంప్రదాయాన్ని కాదని దైవగామ సంప్రదాయంగా మార్చుటకు ప్రయత్నించడం సబబు కాదన్నారు. వైదిక స్మార్త అగమ సంప్రదాయాన్ని.కొనసాగించాలని, గతంలో అర్చక ఉద్యోగ నియమకాలకు ఇచ్చిన నోటిఫికేషన్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోప్వా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వింజమూరు సుధాకర్, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు నవీన్ కుమార్ శర్మ, తొర్రూరు, దంతాలపల్లి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఓలేటి లక్ష్మణాచార్యులు, పోలంపల్లి రమణా శర్మ, రామగిరి భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.



