ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeఎడిటోరియల్శ్రీరాముని ధర్మాన్ని పాటించాలి

శ్రీరాముని ధర్మాన్ని పాటించాలి

📰 Generate e-Paper Clip

శ్రీరాముని ధర్మాన్ని పాటించాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

శ్రీరామచంద్రస్వామి ధర్మ నిరతిని అందరూ పాటించాలని సోమారం గ్రామ సర్పంచ్ కొమురవెల్లి లింగమూర్తి తెలిపారు. చిన్న జీయర్ స్వామి సంకల్పించిన శ్రీరామ హృదయ కలశం కార్యక్రమం మంగళవారం మండలంలోని సోమారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
శ్రీరామ నామస్మరణతో గ్రామ పురవీధులు మార్మోగాయి.
శ్రీరామ హృదయ కలశాన్ని గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లింగమూర్తి మాట్లాడుతూ.ప్రతి ఇంటిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడం, కుటుంబంలో శాంతి, సౌభాగ్యం నెలకొల్పడం అనే లక్ష్యాలతో చిన్న జీయర్ స్వామి రూపొందించిన ఒక ఆధ్యాత్మిక ఉద్యమమే శ్రీరామ హృదయ కలశం కార్యక్రమం అని తెలిపారు. ఇది శ్రీరామ నామస్మరణ, ప్రార్థన, కుటుంబ సమిష్టి ఆరాధనకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.పుత్రునిగా, భర్తగా, సోదరునిగా, మిత్రునిగా, రాజుగా తన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించి సమస్త జాతికి శ్రీరాముడు.మార్గదర్శకుడయ్యాడన్నారు.ఈ కార్యక్రమంలో.సీతారామచంద్ర స్వామి ఆలయ ధర్మకర్త కుందూరు భరత్ రెడ్డి, గ ఆలయ పూజారులు రామాచార్యులు, స్థానికులు రాము, కుందూరు శోభారాణి, తిరుమల్ రెడ్డి, కుందూరు గీతా దేవి, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!