ePaper
Tuesday, August 4, 2026
ePaper
Homeఎడిటోరియల్మద్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి! కుటుంబాల సంక్షేమం – సమాజ శ్రేయస్సే మన లక్ష్యం.

మద్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి! కుటుంబాల సంక్షేమం – సమాజ శ్రేయస్సే మన లక్ష్యం.

📰 Generate e-Paper Clip

మద్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలి!
కుటుంబాల సంక్షేమం – సమాజ శ్రేయస్సే మన లక్ష్యం.

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య

సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

నమస్తే భారత్ :-మరిపెడ

ప్రభుత్వం బడ్జెట్ ఆదాయ పెంపుదల కొరకు మద్యం దుకాణాల తోపాటు బెల్టు షాపులను విపరీతంగా పెంచి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని మద్యం నియంత్రణకు చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆగస్టు 4న మండల పార్టీ విస్తృతస్థాయి సమావేశం మండల కమిటీ సభ్యులు బాణాల రాజన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం వినియోగం ఏటా 6,7 శాతం పెరుగుతున్నట్టు గణంకాలు చెబుతున్నాయి 2016 లో దుకాణాల వేలంపాట ద్వారా 12,706 కోట్ల ఆదాయం రాగా 2024 25 లో 39వేల 500 కోట్ల ఆదాయానికి పెంచుకున్నారు మద్యం అమ్మకాలపై టాక్స్ ద్వారా మరో 40 వేల కోట్ల ఆదాయం వస్తుంది మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల ఆదాయానికి అవకాశం కల్పించుకున్నారు ఆరోగ్యాలు కాపాడుకోవాలని అడ్వర్టైజ్మెంట్లు ద్వారా ప్రచారం చేస్తూ మరోవైపు మద్యం వినియోగాన్ని పెంచుతున్నారు లైసెన్స్ దుకాణాలే కాక గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా పార్సిల్స్ డోర్ డెలివరీ చేస్తూ గ్రామాల్లో ఏరులై పారేలాగా మద్యం కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు ఎం ఆర్ పి రేట్లకు మించి అముతూ ప్రజలను చూసుకుంటున్నారని వారన్నారు ఇంత నడుస్తున్న ఎక్సైజ్ శాఖ వారు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు ఉన్న చట్టాలను కూడా అమలు చేయడం లేదు ప్రజల ఆరోగ్యాన్ని గమనించి మద్యం అమ్మకాలు నియంత్రించాలని ప్రజల ఆర్థిక పరిస్థితికి నష్టం రాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఎం మరిపెడ మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ మండల కమిటీ సభ్యులు బాణాల రాజన్న మండల నాయకులు నలబోలు లక్ష్మారెడ్డి తూము విజయ్ కుమార్ పోలెపాక గణేష్ బయ్య సురేష్ అల్వాల ఏకమ్మ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!