ePaper
Monday, August 10, 2026
ePaper
Homeఎడిటోరియల్మౌలిక వసతులే అభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

మౌలిక వసతులే అభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

📰 Generate e-Paper Clip

మౌలిక వసతులే అభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

రూ.1.30 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

గాజులరామారం వీనస్ రాక్ హైట్స్ కాలనీలో ప్రారంభోత్సవం

12 ఏళ్లలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం

నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ

కుత్బుల్లాపూర్, నమస్తే భారత్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గాజులరామారం డివిజన్ పరిధిలోని వీనస్ రాక్ హైట్స్ కాలనీలో రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పన ద్వారానే ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత 12 ఏళ్లుగా కోట్లాది రూపాయల నిధులను తీసుకువచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వీనస్ రాక్ హైట్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వి.సీ. వేమారెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేష్, ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి, సలహాదారులు శివరామ ప్రసాద్, శంకర్ రెడ్డి, మధు, సంయుక్త కార్యదర్శి బాల నాగదుర్గ, కోశాధికారి అరవింద్, సంఘ సభ్యులు, ప్యాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు నవాబ్ భాయ్, మూసా ఖాన్, తారాసింగ్, సాయిబాబా, మసూద్, చిన్నా చౌదరి, మహేష్, నవీన్ దండుగుల, షేక్ జునైద్, ప్రసాద్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!