ePaper
Monday, August 10, 2026
ePaper
Homeఎడిటోరియల్ఐక్యతే మన బలం.కలిసి ఉంటే కలదు సుఖం

ఐక్యతే మన బలం.కలిసి ఉంటే కలదు సుఖం

📰 Generate e-Paper Clip

ఐక్యతే మన బలం.కలిసి ఉంటే కలదు సుఖం

ఫ్యామిలీ ఫ్రెండ్స్ అధ్యక్షులు రాగిరి చంద్రశేఖర్

నమస్తే భారత్ :-తొర్రూరు

కలసి ఉంటే కలదు సుఖం అని సంతోషం అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అధ్యక్షులు రాగిరి చంద్రశేఖర్ అన్నారు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తరగిపోతున్న నేటి సమాజంలో ఫ్రెండ్స్ అంతా ఒక కుటుంబం గా ఏర్పడి కష్టసుఖాలను సుఖ సంతోషాలను పంచుకుంటున్నారూ
ఫ్యామిలీ ఫ్రెండ్స్ అధ్యక్షులు రాగిరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు పిల్లలతో సహా కలిసి ఆషాడమాస వనభోజనాలను నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక భారత్ గ్యాస్ నిరంజన్ రెడ్డి తోటలో ప్రకృతిలో పేదతీరుతూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంగా గరిపారు ఉదయమే టిఫిన్ ని పర్యావ పరిరక్షణ కోసం స్టీల్ ప్లేట్లలో ఆరగించారు అదేవిధంగా మధ్యాహ్నం చక్కటి విందు భోజనం పర్యావరణ హితం లో మేము సైతం అంటూ అరటి ఆకులలోభోజనం చేశారు అనంతరం కేరింతల కొడుతూ క్యారెట్, బీట్ రూట్ వంటి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఫ్యామిలీ నృత్యాలు చేస్తూ జాలీగా గడిపారు.ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం 15 కుటుంబాలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి అందరి కుటుంబాలలో జరిగే కార్యక్రమాల కు హాజరు కావడంతో పాటు వనభోజనాలు మరియు కుటుంబ సభ్యులతో కలిపి ఫామిలీ టూర్ కూడా వెళ్తున్నామని ఇది మా అందరి కుటుంబాలలో ఎంతో ఆప్యాయతను, అనురాగాన్ని పంచుతుందని అందరి మధ్య అనుబంధాన్ని పెంచుతుందని అందరం కూడా ఆనందంగా, సంతోషంగా.గడుపుతున్నామని అన్నారుఈ కార్యక్రమంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ప్రధాన కార్యదర్శి సమన్వయకర్త గుర్రం వెంకన్న కోశాధికారి రాయిపెల్లి యాకయ్య గారు ,ఫ్యామిలీ ఫ్రెండ్స్ సభ్యులు దుబ్బాక శ్రీధర్ రెడ్డి ఎర్ర పూర్ణచందర్, జలగం శ్రీనివాస్ ,ఓలాద్రి మధుకర్ రెడ్డి ,పులి ముత్తిలింగం, ఫైండ్ల రాజు, గోడిశాల రఘు పులి యాక మల్లయ్య, బొడ్డు రమేష్,షేను శ్రీనివాస్,పైడ్ల రవి ,ఎర్రబోయిన కుమార్ లతో పాటు కుటుంబ సభ్యులు.స్వాతి,సంగీత,విజయమ్మ,వాణి,మాధవి,శ్రీదేవి,శారద,జయ,హైమ,లలిత ,రమ్యకృష్ణ,హరిత, పద్మ ,స్వప్న, అపర్ణ మరియు పిల్లలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!