ePaper
Thursday, July 16, 2026
ePaper
Homeఎడిటోరియల్రాజీవ్ గాంధీ నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

రాజీవ్ గాంధీ నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

📰 Generate e-Paper Clip

రాజీవ్ గాంధీ నగర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

 

-మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హామీ

 

-మాజీ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన రాజీవ్ గాంధీ నగర్ నూతన కమిటీ సభ్యులు

 

-నూతన అధ్యక్షుడు అజయ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన కూన శ్రీశైలం గౌడ్

 

-కాలనీలోని ప్రజా సమస్యలను వివరించిన కమిటీ ప్రతినిధులు

 

-అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని భరోసా

 

కుత్బుల్లాపూర్, జూలై 14 ( నమస్తే భరత్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ నూతన కమిటీ సభ్యులు స్థానిక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అజయ్ కుమార్ ని మాజీ ఎమ్మెల్యే అభినందించి, శాలువాతో సత్కరించిన కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు సమస్యలు నెలకొన్నాయని మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే తనకు ఎప్పుడూ ప్రాధాన్యమని పేర్కొన్నారు. కాలనీలో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ నగర్ కమిటీ సభ్యులు సంపత్ రెడ్డి, అశోక్, వేణుగోపాల్, మహిపాల్ రెడ్డి, వెంకటేష్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!