బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం
నమస్తే భారత్ :-తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో బుధవారం హన్మకొండ లక్ష్మి నరసింహ హాస్పటల్ లుమినిష్ డాక్టర్ సంధ్య రాణి సహకారంతో బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నలుగురి రామలింగం మాట్లాడుతూ బాలవికాస ఆధ్వర్యంలో 160 మందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.డాక్టర్ తేజస్విని, డాక్టర్ సంకీర్తన లు మాట్లాడుతూ మహిళలు గర్భకోశ సమస్యలు రాకుండా ప్రత్యేక శ్రద్ధ.తీసుకోవాలని,బీపీ షుగర్ పరీక్షలు చేయించుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ వై. రమా,లక్ష్మీ లుమినస్ సిబ్బంది సంపత్ రెడ్డి,సిస్టర్ కృష్ణవేణి, ప్రసన్న,భారతి,బిక్షపతి,గ్రామ ఉపసర్పంచ్ మధుషా ఉపేందర్, కార్యదర్శి బి.హేమలత,టి. వెంకటకృష్ణయ్య,వార్డు సభ్యులు ఎం.యాకయ్య జి.పుల్లయ్య, సిహెచ్. యాకయ్య,ప్రమోద్, శిరీష,బాల వికాస కో ఆర్డినేటర్ శైలజ,శోభా రాణి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



