సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన

హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు
నమస్తే భారత్ షాద్ నగర్,జులై23: ఫరూఖ్ నగర్ మండల్ ఎంపీడీవో ఆఫీసులో, గౌరవ ఎంపీడీవో శ్రీకాంత్ గారీ అధ్యక్షతన వర్షాకాలం అత్యవసర పంటల ప్రణాళికపై ఫరూక్నగర్ మండల సర్పంచులకు, డిప్యూటీ సర్పంచులకు, విలేజ్ సెక్రటరీలకు మరియు ఏ.ఈ.ఓ లకు ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో ఈరోజు మధ్యాహ్నము హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు ఆరోగ్యము, పరిసరాల పరిశుభ్రత, పోషక ఆహారము మరియు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. అందరూ వర్షా కాలములో అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించుకుంటూ, పరిసరాల పరిశుభ్రత పై శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు. ఇంటి పరిశుభ్రలు పరిశుభ్రత ఉంచుకుంటూ, వర్షాకాలంలో ఇంటి ముందు ఇంటి పక్కల ఇంటి వెనకాలో మురికి నీరు నిలువ ఉంచకుండా చూసుకోవాలని, ఆ మురికి నీళ్లలో ఈగలు మరియు దోమలు ఉత్పత్తి అయి, వివిధ రకాల వ్యాధులను ప్రబలిస్తాయని తెలియజేశారు. దోమలలో అనాపిలిస్ దోమ, క్యూలేక్స్ దోమ, ఎడిస్ (టైగర్ దోమ) అనే వివిధ రకాల దోమలు ఉంటాయని, ఈ దోమల వలన మలేరియా వ్యాధి, ఫైలేరియా వ్యాధి, డెంగు వ్యాధి మరియు చికెన్ గునియా వంటి వ్యాధులు ప్రబలుతాయని తెలియజేశారు. మలేరియా వ్యాధి మరియు డెంగ్యూ వ్యాధి తీవ్రమైనచో ప్రజల ప్రాణాల కె ముప్పు వస్తుందని చెప్పారు. అందువలన మన ఇంటి చుట్టుపక్కల మరియు గ్రామాలలో దోమలు పెరిగే ఆవాసాలను, నీటి నిలువలను ఉండకుండా చూడాలని జై శ్రీనివాసులు తెలియజేశారు. అలాగే అందరూ వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరము రాకుండా ఉండాలంటే నీళ్లను వేడి చేసుకొని, గోరువెచ్చని నీళ్లు తాగాలని, మనము తీసుకునే ఆహారంలో, పోషక పదార్థాలు ఉండే హారపదార్థాలను తీసుకోవాలని, ఆహార పదార్థాల లో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు మరియు గుడ్డు ఉండేటట్లు చూసుకోవాలని చెప్పారు. మంచి పోషకాహారం తీసుకోవడం వలన మానవుని శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, ఎలాంటి వ్యాధులు రాకుండా, వ్యాధి నిరోధక శక్తి కాపాడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, అగ్రికల్చర్ ఆఫీసర్ నిశాంత్ కుమార్, హెచ్ ఓ మేడం, ఏపీఓ మేడం , డి ఈ సార్, ఏ.ఈ సార్ , ఏపీఎం జంగయ్య మరియు ఫరూక్నగర్ మండల సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, ఏ.ఈ.వో.లు, విలేజ్ సెక్రటరీలు పాల్గొన్నారు.



