ePaper
Friday, September 11, 2026
ePaper
Homeఎడిటోరియల్శంభీపూర్ మహంకాళి బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

శంభీపూర్ మహంకాళి బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

శంభీపూర్ మహంకాళి బోనాల ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

-ఉత్సవ సన్నాహాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

-ఆగస్టు 2న జరిగే మహంకాళి అమ్మవారి బోనాలపై ప్రత్యేక దృష్టి

-భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచన

-పారిశుధ్యం, విద్యుత్ దీపాలంకరణ, తాగునీరు, ఇతర సౌకర్యాల పరిశీలన

-ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో ఫోన్‌లో సమన్వయంపై చర్చ

-ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు

పాల్గొన్న పలువురు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు

కుత్బుల్లాపూర్, జూలై 23 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ సర్కిల్, దుండిగల్ డివిజన్ పరిధిలోని శంభీపూర్ గ్రామంలో ఆగస్టు 2న నిర్వహించనున్న శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల ఏర్పాట్లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు శంభీపూర్ క్రిష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను సందర్శించిన ఆయన భక్తుల రాకపోకలకు అనుగుణంగా చేపడుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, తాగునీటి వసతి, విద్యుత్ దీపాలంకరణ, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రద్దీ నియంత్రణకు చేపడుతున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన శంభీపూర్ క్రిష్ణ, బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల నడుమ జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని ముందస్తుగా సిద్ధం చేయాలని, భద్రతా చర్యలతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బండల వెంకటేష్, లింగం గౌడ్, సంగొల్ల తిరుమలేష్, వడ్డే యాదగిరి, అర్కల సురేష్, శేఖర్ గౌడ్, బాలమల్లేష్ రాజు, క్యాసారం శ్రీశైలం యాదవ్, మల్లేష్, కుమ్మరి ప్రశాంత్, సంగొల్ల హనుమంతు, వడ్ల విరాట్, యాదయ్య, అర్కల ప్రవీణ్, మంగలి వెంకటేష్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!