జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న గుర్రం వెంకన్న
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్న గుర్రం వెంకన్న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా మహబూబాబాద్ కలెక్టరేట్ IDOC లో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ,ముఖ్య అతిథులు ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించారు. గుర్రం వెంకన్న రాంపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మరియు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలోనూ అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటుగా విద్యార్థులకు.బోధనోపకరణాలతో వినూత్నమైన పద్ధతిలో బోధించడం అదేవిధంగా పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల మరియు ప్రజలను భాగస్వామ్యం చేయడం వంటి వివిధ అంశాలను గుర్తించి విద్యాశాఖ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం చేసింది .ఈ సందర్భంగా వెంకన్న ని శాలువా,మెమొంటో మరియు ప్రశంస పత్రంతో ఘనంగా సత్కరించింది. కాగా మరిపెడ మండలం నుంచి ఒకే ఒక్కరు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం విశేషం.ఈ సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వెంకన్న మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఈ అవార్డు తనకెంతో గౌరవాన్ని అదేవిధంగా మరింత బాధ్యతను పెంచిందని రాబోయే కాలంలో పాఠశాల అభివృద్ధికి పిల్లల్లో గుణాత్మకమైన విద్యకు మరింత బాధ్యతగా పనిచేస్తానని అన్నారు
ఈ సందర్భంగా జిల్లా అవార్డు అందుకున్న సందర్భంగా వెంకన్న ను సోదరుడు రాయిపెల్లి యాకయ్య మండల విద్యాశాఖ అధికారి అనితాదేవి ,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మంద జయ ప్రధానోపాధ్యాయులు హీరా లాల్ ఉపాధ్యాయ మిత్రులు పెద్దలు కుడితి ఉపేందర్ రెడ్డి ,PRTU జిల్లా అధ్యక్షులు మిరియాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాగర్లమూడి శ్రీధర్, మరిపెడ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కీసర రమేష్ రెడ్డి ,లింగాల మహేష్ గౌడ్ ,గండి కరుణాకర్, దోమల లింగన్న, ఉపాధ్యాయ బృందం రాగిరి చంద్రశేఖర్ ,దుబ్బాక శ్రీధర్ రెడ్డి ,ఎర్ర పూర్ణచందర్, పులి ముత్తులింగం, యాక మల్లయ్య , యాకసాయి , మధుకర్.రెడ్డి.రాజు ,రమేష్ ,రఘు, కుమార్ ,శ్రీనివాస్, వెంకన్న ,లింగరాజు, మురళి ,విజయ్, గణేష్ ,శ్రీధర్, బందు పరశురాములు తదితరులు



