ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణకార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం

కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

కార్మికులు, రైతుల హక్కుల కోసం పోరాటమే లక్ష్యం
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

నమస్తే భారత్ :-మరిపెడ

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ పిలుపునిచ్చారు.
శనివారం మరిపెడ బంగ్లా కార్గిల్ సెంటర్‌లో ఏఐటీయూసీ కార్మికులతో కలిసి ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఎండి అబ్దుల్ రషీద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను, సంక్షేమాన్ని దెబ్బతీసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, కార్మిక హక్కులను నిర్వీర్యం చేయడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం వంటి చర్యలతో సామాన్య ప్రజలపై భారాలు పెరుగుతున్నాయని అన్నారు.
కార్మికులు, రైతులు, కూలీలు, సామాన్య ప్రజల సమస్యలపై ఐక్య పోరాటాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఏఐటీయూసీ నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కార్మికవర్గానికి.పిలుపునిచ్చారు.ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 6, 2026న కరీంనగర్ జిల్లాలోని జ్యోతిరావు పూలే సర్కస్ గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభతో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జాతీయ నాయకులు కామ్రేడ్ అమర్‌జీత్ కౌర్, ఎండి యూసుఫ్, అలాగే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, కామ్రేడ్ ఎస్. బాలరాజు, కామ్రేడ్ వి.ఎస్. బోస్, కామ్రేడ్ ఎం. నరసింహ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు ఏ. నారాయణ, ఎస్. వెంకటేష్, కే. వెంకన్న, ఎన్. వెంకన్న, పి. హనుమంతు, ఎం. నరసయ్య, టీ. లింగయ్య, డీ. నర్సయ్య, జి. మంగీలాల్, వీపునయ్య, జి. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!