గ్లోబల్ ఎక్ససేలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026లో షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి అవార్డుల పంట


న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ కు ఛత్రపతి శివాజి ఐకాన్ అవార్డు
కుంగ్ ఫు లెజెండ్ బ్రుస్లి ఐకాన్ అవార్డు కూడా మాస్టర్ అహ్మద్ ఖాన్ సొంతం
సినీ కళాకారులతో అవార్డుల అందజేత
హార్ష్యం వ్యక్తం చేసిన మాస్టర్ అహ్మద్ ఖాన్
నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్06:తెలంగాణ రాష్టంలో ఆమెచూర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అవార్డ్స్ అసోసియేషన్ అధ్యర్యంలో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఎక్స్సెలెన్స్ ఐకాన్ అవార్డ్స్ – 2026 హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. కరాటే, కుంగ్ ఫు విద్యలలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన వారిని ఎన్నుకొని ప్రతి సంవత్సరo ఈ అవార్డులు అందజేయడం జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా అవార్డు ఫంక్షన్ సినీ కళాకారుల తో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అవార్డు కార్యక్రమం లో షాద్ నగర్ పట్టణానికి చెందిన న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కి చెందిన మాస్టర్ అహ్మద్ ఖాన్ కు ఉత్తమ మాస్టర్ గా ఎన్నికొని ప్రతిష్టాత్మకమైన ఛత్రపతి శివాజీ గ్లోబల్ అవార్డును అందజేశారు. అలాగే కుంగ్ ఫు లో విద్యార్థులకు అద్భుతమైన శిక్షణ ఇచ్చిన సందర్బంగా గ్లోబల్ లెజెండ్ బ్రుస్లీ అవార్డు ను కూడా మాస్టర్ అహ్మద్ ఖాన్ కు అందజేయడం విశేషం. ఈ అవార్డులు సినీ కళాకారులైన శివం శివరాత్రి, గబ్బర్ సింగ్ సాయిబాబా, దువ్వూరి సంజయ్, సుహాని నాథ్ చైల్డ్ ఆర్టిస్ట్, మాస్టర్ కేశవ్ గౌడ్, అమర్ సింగ్, సం సాయి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ గ్లోబల్ ఎక్స్సెలెన్స్ అవార్డ్స్ – 2026 లో తనను ఎన్నుకొని ప్రతిష్టాత్మకమైన ఛత్రపతి శివాజి మరియు లెజెండ్ బ్రు స్లీ అవార్డులు ఇవ్వడం సంతోషకరమని నాకు ఈ అవార్డులు అందజేసినందుకు ఆమెచూర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అవార్డ్స్ అసోసియేషన్ వారికీ కృతజ్ఞతలు తెలిపారు.



