వీరాస్వామి తల్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్

నమస్తే భారత్ :-కేసముద్రం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుడు వీరాస్వామి తల్లి బక్కమ్మ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విచారకరమని కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుగుడు వీరాస్వామి, కానిస్టేబుల్ శ్రీనివాస్ తల్లీ
బక్కమ్మ మృతి చెందిన విషయం అక్కడ ఉన్న నాయకులు,వార్డ్ సభ్యుల ద్వారా తెలుసుకున్న సమ్మి గౌడ్, ఆదివారం ఉప్పరపల్లిలోని ఆమె నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సమ్మిగౌడ్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి కార్యకర్తకు అండగా ఉంటుందని తెలిపారు. సంతోషంలో కాదు బాధలో మీ భుజం తట్టి మీ పక్కన నిలబడతామని భరోసా ఇచ్చారు. గ్రామాలలో ఎవరికి ఏ కష్టం వచ్చిన సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరు సమన్వయం చేసుకుంటూ బాధితులకు అండగా ఉండాలని సూచించారు. అందరు సంఘటితమై బాధలేని లోటును పూడ్చాలని పిలుపునిచ్చారు. కంటికి రెప్పలా ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
సమ్మిగౌడ్ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారు దయాకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు, వార్డు నెంబర్స్ కంచ రాజు, పలస పద్మా వెంకన్న, తండా సంపత్, యువత అధ్యక్షులు తండా శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరిగే విజేందర్, పబ్బతి సారంగం, అడప రమేష్, ఏటురోజు పరిపూర్ణ చారి,పబ్బతి శ్రీనివాస్,పలస నాగేష్,బట్టు మురళి, కంకల కొమురయ్య, ఆవుల బాబు, పబ్బతి శ్రీనివాస్,కంచ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.



