ప్రాథమిక విద్య నుంచే మంచి అలవాట్లు, సత్ప్రవర్తన అలవర్చుకోవాలి

-విద్యార్థుల్లో పచ్చదనంపై అవగాహన పెంపొందించాలి: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్
-సూరారం శ్రీరామ్ నగర్‌లోని ఆన్ టైం స్కూల్‌లో మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమం
-మొక్కల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని వ్యాఖ్య
-విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యత పెంచాల్సిన అవసరం
-పాఠశాల యాజమాన్యం చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించిన ఎమ్మెల్యే
-పచ్చదనం పరిరక్షణలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని పిలుపు
-ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు
కుత్బుల్లాపూర్, జులై 8 ( నమస్తే భరత్ ): మంచి అలవాట్లు, సత్ప్రవర్తన, సామాజిక బాధ్యత వంటి విలువలను విద్యార్థులు ప్రాథమిక విద్యా దశ నుంచే అలవర్చుకోవాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ అన్నారు. సూరారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉన్న ఆన్ టైం స్కూల్ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, పచ్చదన ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్నతనం నుంచే విద్యార్థుల్లో మొక్కల పెంపకంపై ఆసక్తి, ప్రకృతి పట్ల ప్రేమ పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తేనే పర్యావరణ సమతుల్యత నెలకొంటుందని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు పచ్చదనం విస్తరణే శాశ్వత పరిష్కారమని చెప్పారు. మొక్కల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి సంరక్షణ అవసరంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పాఠశాల యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఉదయ్ కిరణ్, ప్రిన్సిపల్ పద్మ కుమారి, మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కోలా శ్రీకాంత్, సిద్ధిక్, హెచ్ఏఎల్ బషీరుద్దీన్, యోగ మల్లేష్తో పాటు స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



