ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్ఉద్యమ సమయంలో, అరెస్టులు అంటే , పారిపోయిన మీరా

ఉద్యమ సమయంలో, అరెస్టులు అంటే , పారిపోయిన మీరా

📰 Generate e-Paper Clip

*ఉద్యమ సమయంలో, అరెస్టులు అంటే , పారిపోయిన మీరా.!*

**నన్ను సమైక్యవాది అని మాట్లాడేది.!*

*అసలు ఉద్యమం అంటే ఏమిటో పిఆర్టియు శ్రీధర్ రెడ్డికి తెలుసా.!*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై24:తెలంగాణలో భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ ఫోటోలకు ఏనాడైనా నివాళులర్పించిన మొహామేనా మీది.ప్రజా సమస్యల పైన గాని ఉపాధ్యాయుల సమస్యల పైన గాని ఏనాడైనా నోరు విప్పి అరెస్టయ్యారా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చే దమ్ముందా..!అమరవీరుల స్తూపం నిర్మాణంలో ఇసుమంతైనా పాత్ర మీది ఉందా.తెలంగాణ ఉద్యమ నిర్మాత జయశంకర్ సార్, విగ్రహానికి ఏనాడైనా కనీసం పూలదండ వేసి నివాళులు అర్పించారా.ఇన్ని ఏళ్లలో ఒక్క నాడైనా అంబేద్కర్ వర్ధంతి జయంతులు జరిపారా.అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో (జేఏసీ)జాయింట్ యాక్షన్ కమిటీ సన్నాహక సమావేశాలు జరిగిందే నా ఇంట్లో టీజేఏసీ షాద్ నగర్ చైర్మన్ జనార్ధన్ నువ్వేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది పిఆర్టియు శ్రీధర్ రెడ్డికి సవాలు విసిరిన, మూలే జనార్ధన్, జేఏసి,బృందం.షాద్ నగర్ పట్టణంలోని అమరవీరుల స్థూపం నిర్మాణలో అన్ని రకాలుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహాయం చేసి స్థూప నిర్మాణంలో టీజేఏసీ అహర్నిశలు కృషి చేసిందని అమరవీరుల స్థూపం నిర్మాణం మొత్తం తమ భుజాలపై వేసుకొని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న విజయవంతం చేశామని టీజేఏసీ చైర్మన్ మూలె. జనార్ధన్,వైస్ చైర్మన్ కరుణాకర్ తెలిపారు, తెలంగాణ ఉద్యమం సమయంలో తన ఇంట్లోనే జేఏసీ ఏర్పడిందని టీజీ. శ్రీనివాస్ తో పాటు ఆ విషయం అందరికీ తెలుసని తెలంగాణ ఉద్యమ సమయంలో పిఆర్టియు శ్రీధర్ రెడ్డికి పోలీసుల నుండి ఫోన్ వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోని ఫరార్ అయ్యారని అలాంటి వారా ఇప్పుడు మాట్లాడేదని అన్నరు ఆ నాటి నుండి నేటి వరకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి గానీ జయశంకర్ సార్ విగ్రహానికి గాని ఏనాడైన పూలదండలు వేసి జయంతి వర్ధంతిలు జరిపారా ఇలాంటివారా మాట్లాడేది అంటూ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిఆర్టియు శ్రీధర్ రెడ్డి పై ఆగ్రహ వ్యక్తం చేశారు మరోసారి అవాకులు,చవాకులు, మాట్లాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో వెంకటయ్య,శివారెడ్డి, నర్సింలు గౌడ్, బిశ్వ కృష్ణయ్య, బిజిలి సత్యం, వలిగే కృష్ణ, లక్ష్మీదేవమ్మ, బాలయ్య, రాములు, అర్జున్ కుమార్, తావుర్యా, ,నక్క బాల్ రాజ్, నర్సింలు, మందారం నరసింహులు ఆర్టీసీ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!