పాపన్నపేట జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో
ఉద్యోగులు ఆడిందే ఆట…పాడిందే పాట…!!
మెదక్ జిల్లా పాపన్నపేట, మండలం జూలై 24 (నమస్తే భారత్)
మండల కేంద్రమైన పాపన్నపేట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ ఆర్ఈజిఎస్) కార్యాలయంలో ఉద్యోగులు సెల్ ఫోన్లలో వీక్షిస్తూ, కార్యాలయానికి వచ్చిన వారిని పట్టించుకోకుండా ఆడిందే ఆట…పాడిందే పాట..అన్నట్లు వ్యవహరిస్తున్నారని మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ పథకం కూలీలు వాపోతున్నారు. శుక్రవారం రోజు మధ్యానం 01.20గం.కు కార్యాలయానికి వెళ్లిన విలేకరులకు చేదు అనుభవం ఎదురైంది.కూలీలు అడిగిన ప్రశ్నలకు సిబ్బంది సరిగా సమాధానం చెప్పలేని రీతిలో,తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.ఈ విషయమై పాపన్నపేట మండల ఏపిఓ బి. మైపాల్ రెడ్డినీ పోన్ లో సంప్రదించడానికి విలేకరులు ప్రయత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.ఇప్పటికైనా కార్యాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి,సరైన సమాధానం ఇవ్వాలని వారు కోరుతున్నారు.



