ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్పాపన్నపేటలో ప్రమాద బాధితులను పరామర్శించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

పాపన్నపేటలో ప్రమాద బాధితులను పరామర్శించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

📰 Generate e-Paper Clip

పాపన్నపేటలో ప్రమాద బాధితులను పరామర్శించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్,జూలై24 (నమస్తే భారత్)

:మండల కేంద్రమైన పాపన్నపేటకు చెందిన మరెల్లి రాములు,చిన్న కటికే రషీద్ గత వారం రోజుల క్రితం హైద్రాబాద్ శివారులో మేకలను అమ్మడానికి వెళ్లి నిద్ర రావటంతో రోడ్డు పక్కన తమ వాహనాన్ని నిలపగా, ప్రమాదవశాత్తు కంటైన్నర్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు.ఈవిషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శుక్రవారం రోజు పాపన్నపేటలోని ఆయన స్వగృహాలకు వచ్చి ఇరువురు కుటుంబీకులను పరామర్శించారు. మరెల్లి రాములు,చిన్న కటికే రషీద్ కుటుంబాలకు,గాయపడి ఇంట్లో మంచంపై చికిత్స పొందుతున్న చిన్న కటికే గౌస్ లకు తమ వంతుగా పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో పాపన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంపేట నరేందర్ గౌడ్,పాపన్నపేట చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కొడపాక విట్టల్,పాపన్నపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు వళ్ళందేశి శ్రీనివాస్,ఉప సర్పంచ్ ఎండీ.సద్దాం,మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎల్.మల్లప్ప,నాగ్సన్ పల్లి సర్పంచ్ దండెం దుర్గేశ్,కుర్తివాడ సర్పంచ్ చెట్టుకిందిశ్రీధర్,మాజీ ఉప సర్పంచ్ ఎండీ.ఖలీం, నాయకులు దోసనీ సంగమేశ్వర్,ముషెట్టి కిష్టయ్య,మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ.గౌస్,సుంకరి ఆంజనేయులు,బెస్త శ్రీశైలం, కుర్తివాడ ప్రసాద్ గౌడ్,క్యాశగల్ల ప్రవీణ్ గౌడ్, వార్డు సభ్యులు సీతానగరం రాజు,కుమ్మరి పోచయ్య, యేసు,చిన్న కటికే ఇబ్రహీం,ఎండీ.
రఫీ,ఎండీ.రషీద్,బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!