ePaper
Monday, August 10, 2026
ePaper
Homeఎడిటోరియల్నందినగర్‌లో కీలక భేటీ

నందినగర్‌లో కీలక భేటీ

📰 Generate e-Paper Clip

నందినగర్‌లో కీలక భేటీ

కేటీఆర్‌ను కలిసిన ప్రకాష్ అంబేద్కర్.. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భారత్ ): హైదరాబాద్ నందినగర్‌లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పరస్పరం చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో పాటు సామాజిక వర్గాల ప్రముఖుల మధ్య కొనసాగుతున్న సమన్వయానికి నిదర్శనంగా నిలిచిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!