ePaper
Friday, October 30, 2026
ePaper
Homeఎడిటోరియల్పశువుల తొట్టెల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి ఎంపీడీవో అద్వైత

పశువుల తొట్టెల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి ఎంపీడీవో అద్వైత

📰 Generate e-Paper Clip

పశువుల తొట్టెల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలి

 

 ఎంపీడీవో అద్వైత

ఖానాపురం అక్టోబర్ 29(మల్లేష్ నమస్తే భారత్ ) :

ఖానాపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం మరియు దేవాలయ ప్రాంగణం వద్ద రెండు ప్రదేశాల్లో పశువుల తొట్టెల నిర్మాణానికి ఎంపీడీవో వి. అద్వైత, సర్పంచ్ మాడ్రాజు వెంకన్న మార్కింగ్ పనులను చేపట్టారు. ఖానాపురం మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో పశువుల తొట్టెల నిర్మాణానికి అనువైన ప్రదేశాలను గుర్తించి, మార్కింగ్ పనులు పూర్తి చేసి, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎంపీడీవో సూచించారు. అలాగే ఖానాపురం గ్రామపంచాయతీలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు జలసిరి పనులను మిషన్ మోడ్‌లో చేపట్టాలని ఎంపీడీవో ఆదేశించారు. ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగిస్తూ, నీటి వృథాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. గ్రామాల్లో నీటి వృథా జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, నీటిని వృథా చేసే గ్రామస్థులపై నిబంధనల ప్రకారం రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తులో నీటి కొరత తలెత్తకుండా గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో వి. అద్వైత పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, ఈసీ అరుణ్, టీఏ వీరబాబు, ఎఫ్ఏ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!