ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeఎడిటోరియల్అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి: ఎం.డి. అబ్దుల్ రషీద్

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి: ఎం.డి. అబ్దుల్ రషీద్

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలి:

ఎం.డి. అబ్దుల్ రషీద్

నమస్తే భారత్ :-మరిపెడ

మరిపెడ బంగ్లా మండల కేంద్రంలోని కౌన్సిల్ బోర్డు తండా కాలనీలో జరిగిన సిపిఐ పార్టీ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ, గతంలో కొంతమంది జర్నలిస్టులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, ఇంకా అర్హులైన అనేకమంది జర్నలిస్టులకు ఇళ్లు మంజూరు కాలేదని అన్నారు.ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు చేరవేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డులు కలిగిన అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలల్లో ప్రత్యేక రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన ప్రముఖ జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ పేరును ఈ కాలనీకి పెట్టాలని అబ్దుల్ రషీద్ కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలంతో పోరాడి, ప్రజాస్వామ్య విలువల కోసం ప్రాణత్యాగం చేసిన షోయబుల్లా ఖాన్ స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా ఆయన పేరును కాలనీకి నామకరణం చేయాలని సూచించారు.
గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైన ప్రాంతాల్లో కూడా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయా కాలనీల్లో విద్యుత్ సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, పార్కింగ్ స్థలాలు, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పించాలని కోరారు.
ఇళ్లు మంజూరు చేయడంతోనే ప్రభుత్వ బాధ్యత పూర్తికాదని, వాటిలో నివసించే కుటుంబాలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినప్పుడే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాందాస్, ప్రభాకర్, సతీష్, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!