ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించాలి - బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించాలి – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించాలి – బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
నమస్తే భరత్, 31/10/2026/ నారాయణపేట జిల్లా,

అమరచింత పట్టణ కేంద్రంలో బీజేపీ టౌన్ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మంగా లావణ్య అంజన్ గారి అధ్యక్షతన జరిగిన MLC ఎన్నికల ఎన్రోల్ మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మక్తల్ నియోజకవర్గ MLC ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రులని ఆన్లైన్ ద్వారా ఓటుహక్కు కల్పించాలని, మక్తల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలనుండి 10,000 మందికి పైగా ఎన్రోల్మెంట్ చేసే విదంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.

అనంతరం హామీలను గాలికొదిలేసి, ప్రజాపాలన అంటూ కలబొల్లి మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గరుమాట్లాడుతూ,ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే విజయం మాదేనని విర్రవీగిన కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడిందని ఎద్దేవా చేసారు.

కాంగ్రెస్ పార్టీ దుందుడుకు తనానికి విద్యావంతులు, ఉపాధ్యాయులు గట్టి బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, పథకాలను అమలు చేయలేకపోతే త్వరలో తెలంగాణలో జరిగే 2 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని, యావత్ ప్రపంచం ప్రదానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారిని ఆదర్శంగా తీసుకుంటుంటే, ఇక్కడి కాంగ్రెస్ బడా నాయకులు ఓట్ చోరీ అనీ,ఈవీఎంల ద్వారా ఎన్నికలు వద్దు అని మాట్లాడడం అడ రాక గజ్జలు బరువు అన్నట్లుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్నల ఉసురు తగిలి కొట్టుకు పోవడంకాయమని బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు మండిపడ్డారు.

తరువాత ఆత్మకూర్ పట్టణంలోని కోర్ట్ ఆవరణలో బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సింగా కోరారు.

ఇట్టికార్యక్రమంలో సంగ్ పరివార్ జిల్లా నాయకులు శ్రీ లక్ష్మినారాయణ గారు,MLC ఎన్నికల సహా ఇంచార్జ్ శ్రీ జిందే జ్యోతి శ్రీనివాస్ గారు,చేనేత కార్మిక సంగం అధ్యక్షులు శ్రీ తిరుమల్ రఘురామ్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ ఒగ్గు వెంకటేష్ గారు,బీజేపీ రాష్ట్రనాయకులు శ్రీ నరాల నారాయణ గారు, శ్రీ మరాటి అశోక్ గారు,కౌన్సిలర్లు శ్రీ వేద విష్ణు గారు,శ్రీ పారుపల్లి ఉసన్న గారు, మాజీ అధ్యక్షులు శ్రీ విజయ్ యాదవ్ గారు,నర్వ మండల బీజేపీ అధ్యక్షులు శ్రీ అజిత్ సింహ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ్ రామ్ గారు,బీజేవైఎం జిల్లా కార్యదర్ది శ్రీ సాయి గారు,మండల ఉపాధ్యక్షులు శ్రీ భీంసేన్ గారు,శ్రీ వెంకటేశ్వర్లు గారు,ఆత్మకూర్ పట్టణ మరియు రూరల్ అధ్యక్షులు శ్రీ మండ్ల సురేష్ గారు, శ్రీ అశోక్ భూపాల్ గారు, జిల్లా నాయకులు శ్రీ ఆనంద్ గారు,శ్రీ బాలరాజు తది తరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!