ePaper
Saturday, August 1, 2026
ePaper
Homeఎడిటోరియల్రాజీవ్ గృహకల్ప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు కోరిన కమిటీ

రాజీవ్ గృహకల్ప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు కోరిన కమిటీ

📰 Generate e-Paper Clip

రాజీవ్ గృహకల్ప ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వ నిధులు కోరిన కమిటీ


కొలన్ హన్మంత్ రెడ్డికి వినతిపత్రం.. నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ
➤ శ్రీ ఉమామహేశ్వర స్వామి, శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల విజ్ఞప్తి

➤ బాచుపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జితో ఆలయ కమిటీ భేటీ

➤ ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న కొలన్ హన్మంత్ రెడ్డి

➤ రాజీవ్ గృహకల్ప బోనాల మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేత

➤ భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సహకారం అందించాలని కమిటీ విజ్ఞప్తి

➤ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ ప్రముఖులు

నిజాంపేట్, జూలై 31 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు శనివారం బాచుపల్లిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గృహకల్పలోని రెండు దేవాలయాల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయాల అభివృద్ధి ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం రాజీవ్ గృహకల్పలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు కొలన్ హన్మంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ప్రెసిడెంట్ పితాని శ్రీనివాస్ రావు, టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, కుమార్ రెడ్డి, రాంచందర్ నాయక్, రమణ, ప్రభాకర్ రెడ్డి, కూరగాయల శివ, వారికుప్పల దశరథ్, తోట బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!