ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎస్ ఐ రామ్మోహన్‌కు బీఆర్ఎస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

ఎస్ ఐ రామ్మోహన్‌కు బీఆర్ఎస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

ఎస్ ఐ రామ్మోహన్‌కు బీఆర్ఎస్ నాయకుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

ఖానాపురం నవంబర్ 14( మల్లేష్ నమస్తే భారత్ ) :
ఖానాపురం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గుగులోతు రామ్మోహన్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఖానాపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో కేక్ కట్ చేసి, ఎస్‌హెచ్‌ఓ రామ్మోహన్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్‌హెచ్‌ఓ రామ్మోహన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాటోత్ సదర్ లాల్, మాజీ జెడ్పీటీసీ గుగులోతు బాలు నాయక్, మాజీ ఎంపీటీసీ బోడ పూలు, సర్పంచులు వీరన్న, బాలకిషన్, ప్రవీణ్, మాజీ సర్పంచులు భూక్య వెంకన్న, సుమన్, రమేష్, పార్టీ అధ్యక్షులు రెడ్డి, బందారపు శ్రీనివాస్ గౌడ్, ముద్దంగుల రవీందర్, దంజ్యా నాయక్ తదితరులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!