మున్సిపల్ కార్మికులకు రూ.21 వేల కనీస వేతనం అమలు చేయాలి
సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎస్బీఐ కాలనీలో ఈరోజు మున్సిపల్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పట్టణాల పరిశుభ్రత కోసం.నిరంతరం.శ్రమిస్తున్నప్పటికీ వారికి తగిన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు.అందకపోవడం.దురదృష్టకరమన్నారు.మున్సిపల్ కార్మికులకు నెలకు రూ.21,000 కనీస వేతనం వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, ఈపీఎఫ్, ప్రమాద బీమా, భద్రతా పరికరాలు, ఆరోగ్య సదుపాయాలు వంటి అన్ని కార్మిక హక్కులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలకు అత్యంత కీలకమైన సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి, వారి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఉప్పలయ్య, పూల్ సింగ్, నరసయ్య, శీను, పెద్ద ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.



