ePaper
Sunday, July 12, 2026
ePaper
Homeఎడిటోరియల్భగత్‌సింగ్ నగర్ సమస్యల పరిష్కారానికి చర్యలు

భగత్‌సింగ్ నగర్ సమస్యల పరిష్కారానికి చర్యలు

📰 Generate e-Paper Clip

భగత్‌సింగ్ నగర్ సమస్యల పరిష్కారానికి చర్యలు

-కాలనీ సంక్షేమ సంఘం వినతిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సృజన

-సంబంధిత శాఖల అధికారులకు తక్షణ చర్యల ఆదేశం

కుత్బుల్లాపూర్, జూలై 8 నమస్తే భరత్: భగత్‌సింగ్ నగర్ కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన (ఐఏఎస్) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని చింతల్ సర్కిల్‌లో బుధవారం నిర్వహించిన కాలనీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశంలో భగత్‌సింగ్ నగర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ కాలనీలోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పచ్చిమట్ల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్ సంబంధిత సమస్యలు, దెబ్బతిన్న రహదారులు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో మౌలిక సదుపాయాల కొరతతో పాటు పలు సమస్యలను వివరించారు. సమస్యలను పరిశీలించిన కమిషనర్ సంబంధిత అధికారులకు వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేశ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ స్పందన, వాటర్ వర్క్స్ డీజీఎం వికాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భగత్‌సింగ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. ప్రతాప్ రెడ్డి, సలహాదారు రాఘవులు, ఉపాధ్యక్షుడు బీసు వెంకటేశం గౌడ్, టైలర్ మల్లేష్, కిషన్ గౌడ్, రమేష్ తదితరులు సమావేశంలో పాల్గొని కాలనీ సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!