ePaper
Thursday, July 2, 2026
ePaper
Homeఎడిటోరియల్కిషన్ నగర్ లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా అవగాహన కల్పించిన

కిషన్ నగర్ లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా అవగాహన కల్పించిన

📰 Generate e-Paper Clip

*కిషన్ నగర్ లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా అవగాహన కల్పించిన*

*ఫరూక్ నగర్ ఉపసర్పంచల అధ్యక్షులు ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్*

ఆదాబ్ సైబరాబాద్ షాద్ నగర్ జూన్29:ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదై ఉండేలా చూసుకోవాలని కిషన్ నగర్ ఉపసర్పంచ్ ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్ అన్నారు. కిషన్ నగర్ గ్రామాలలో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి. బాలరాజు , పద్మ ,బిఎల్ఎ లు సుజాత,రమాదేవి సమత, పి . కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు . ఓటరు నమోదు ప్రక్రియపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఓటరు జాబితా సవరణ ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఉన్న తప్పులను సరిచేసుకోవడం, కొత్తగా అర్హత పొందిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, వివరాల్లో మార్పులు చేసుకోవడం వంటి అంశాలపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బూత్ స్థాయిలో ప్రజలకు సహకరిస్తూ ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు అధికారులకు అవసరమైన వివరాలు అందించి ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!