మూడో వార్డులో పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న
కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను

నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలోని మూడో వార్డులో పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించి, కాలువలను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేయించడం జరిగింది. మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.వార్డు ప్రజలు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణంలో జీవించాలనే లక్ష్యంతో చెత్త తొలగింపు, మురికి కాలువల శుభ్రత వంటి పనులను చేపట్టారు. వర్షాకాలంలో కాలువలు మూసుకుపోవడం వల్ల ఏర్పడే సమస్యలను నివారించేందుకు ముందస్తుగా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను మాట్లాడుతూ, వార్డును పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కోరారు. వార్డులో ప్రజలకు ఎలాంటి పారిశుద్ధ్య సమస్యలు.ఉన్నావెంటనే.పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.



