ePaper
Monday, August 24, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రజావాణిలో మండల సమస్యలపై సీపీఐ వినతిపత్రం

ప్రజావాణిలో మండల సమస్యలపై సీపీఐ వినతిపత్రం

📰 Generate e-Paper Clip

ప్రజావాణిలో మండల సమస్యలపై సీపీఐ వినతిపత్రం

ఎం.డి. అబ్దుల్ రషీద్
సిపిఐ జిల్లా సమితి సభ్యులు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మండల ఉన్నతాధికారులకు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్.వినతిపత్రం.సమర్పించారు.మండలంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతవరకు నిర్మించి అసంపూర్తిగా ఉన్న గృహాలను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పరిగణనలోకి తీసుకుని, అర్హులైన కుటుంబాలకు గృహ నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.అదేవిధంగా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని కొండ సముద్రం కట్టపై అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం పేరుతో రహదారి పనులు నిలిచిపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఈ రహదారిపై కొత్తతండా, బోడతండా, కౌన్సిల్‌బోర్డు తండా తదితర ప్రాంతాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని, రహదారి పరిస్థితి కారణంగా విద్యార్థులు, రైతులు, కూలీలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అసంపూర్తి గృహాలకు ఇందిరమ్మ పథకంలో అవకాశం కల్పించడంతో పాటు కొండ సముద్రం రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎం.డి. అబ్దుల్ రషీద్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!