ePaper
Tuesday, August 25, 2026
ePaper
Homeఎడిటోరియల్గౌడ సహకార పరపతి సంఘం మండల కమిటీ ఎన్నిక జీఎస్ పీఎస్ అధ్యక్షుడిగా దేశగాని...

గౌడ సహకార పరపతి సంఘం మండల కమిటీ ఎన్నిక జీఎస్ పీఎస్ అధ్యక్షుడిగా దేశగాని కుమార్ గౌడ్

📰 Generate e-Paper Clip

గౌడ సహకార పరపతి సంఘం మండల కమిటీ ఎన్నిక

 

జీఎస్ పీఎస్ అధ్యక్షుడిగా దేశగాని కుమార్ గౌడ్

 

నమస్తే భారత్ :-తొర్రూరు

 

గౌడ సహకార పరపతి సంఘం(జి ఎస్ పి ఎస్) నూతన అధ్యక్షునిగా దేశగాని కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు.

ఈ మేరకు గోపా జిల్లా అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి.రమేష్.గౌడ్.తెలిపారు.సోమవారం డివిజన్ కేంద్రంలో గౌడ సహకార పరపతి సంఘం 22వ వార్షిక సమావేశం దీకొండ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన రాయి పెల్లి యాకయ్య గౌడ్ సమన్వయంలో.నిర్వహించారు.ఈ సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు.సంఘ ప్రధాన కార్యదర్శిగా పులి ముత్తిలింగం గౌడ్, కోశాధికారిగా.బాలగాని.నర్సయ్య.గౌడ్.గౌరవాధ్యక్షుడిగా మోడెం వెంకన్న గౌడ్ లను.ఏకగ్రీవంగా.ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా తాళ్ల పెళ్లి బిక్షం గౌడ్, పెరుమాండ్ల వెంకన్న గౌడ్, కార్యదర్శులుగా బండారి ఎల్ల గౌడ్, చిరగాని రమేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా రావుల సదానందం గౌడ్, తాళ్ళపెళ్లి నాగయ్య గౌడ్, గుండ్ల అనిల్ లు ఎన్నికయ్యారు.నూతన అధ్యక్షుడు కుమార్ గౌడ్ మాట్లాడుతూ.గౌడ కులస్తులకు బీసీ రుణాల్లో ప్రాధాన్యత కల్పించాలని, గౌడ కులస్తులకు ప్రత్యేక.పథకాలు.ప్రకటించాలన్నారు.గీతా పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి రూ. 1000 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. వృద్ధులైన గీత కార్మికులకు రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలని, ఈత, తాటి చెట్లు ఎక్కేందుకు ఉపయోగపడే యంత్ర పరికరాలను రాయితీపై గీత కార్మికులకు అందించాలని కోరారు. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

రాబోయే 2 సంవత్సరాలలో అందరి సహకారంతో సంఘ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు. దానిలో భాగంగా

సంఘ ముఖ్య సలహాదారుడు గోపా మండల అధ్యక్షుడు రాయి పెళ్లి యాకయ్య గౌడ్ విశిష్ట సేవా జ్యోతి, గురుదేవోభవ, కళా రత్న, గురుబ్రహ్మ వంటి జాతీయ, రాష్ట్ర అవార్డులు అందుకున్న సందర్భంగా మెమొంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా.గతంలో చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచి అమెరికాలో ఎమ్మెస్ చేస్తున్న కొండం సింధును, ఐఐటీ ఎంటెక్ సీటు పొందిన గంగోత్రి, మెడిసిన్ లో సీటు పొందిన సాయి మన్విత , సంకీర్తన, సంజీవనీలతోపాటు ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించిన యశ్వంత్ లను శాలువా, మెమెంటో తో సంఘ సభ్యులు అందరూ ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పూర్వ ప్రధాన కార్యదర్శి జలగం శ్రీనివాస్ గౌడ్, గోపా జిల్లా ఉపాధ్యక్షుడు పెరుమాళ్ళ రమేష్ గౌడ్ , తండా రామస్వామి గౌడ్, కొయ్యడ కుమారస్వామి , రమేష్, కొండం జనార్దన్, నానం రత్నశేఖర్ గౌడ్, బండారి ఎల్లా గౌడ్, మోడం వెంకన్న గౌడ్, సోమ నరసయ్య గౌడ్, నగేష్ గౌడ్ , అనేపురం వెంకన్న గౌడ్, దేవేందర్ గౌడ్, గునిగంటి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!