ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ స్వంత నిధులతో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
నమస్తే భారత్,, 26/6/2026/ నారాయణపేట జిల్లా
మక్తల్ నియోజక వర్గంలోని వివిధ మండలాల బీజేపీ నాయకులు మరియు కార్యకర్తల కోరిక మేరకు స్వంత నిధులతో హైమాస్ట్ లైట్స్ ఎపిస్తానని మాట ఇచ్చిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు వీలైనంత త్వరలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పారు.
అందులో భాగంగానే కృష్ణ మండలంలోని గుడెబల్లూర్ గ్రామంలో మరియు హిందుపూర్ చౌరస్తా దగ్గర, ఉట్కూర్ మండలంలోని వల్లంపల్లి గ్రామం మరియు మరికల్ మండలంలోని పుట్టగడ్డ అప్పంపల్లి గ్రామంలో స్వంత నిధులతో హైమాస్ట్ లైట్స్ కి బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారు, నారాయణపేట జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీ పగడాకుల శ్రీనివాస్ గారి తో కలిసి కొన్ని చోట్ల భూమి పూజ కూడా చేసారు.
ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ హైమాస్ట్ లైట్స్ ఏపించిన బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారికి బీజేపీ శ్రేణులు అభినందనలు తెలిపారు.
ఇట్టి హైమాస్ట్ లైట్స్ ని త్వరలోనే ప్రారంభిస్తారని ఆయాగ్రామాల సర్పంచులు, కార్యకర్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి శ్యాంసుందర్ గౌడ్ గారు, వల్లంపల్లి సర్పంచ్ శ్రీ వెంకట్రాములు గారు, మరికల్ మండలం జిల్లా కౌన్సిల్ సభ్యులు వై. తిరుపతి రెడ్డి గారు, కృష్ణ మండలం బీజేపీ అధ్యక్షులు శ్రీ నల్లే నర్సప్ప గారు మరియి బీజేపీ పదాది కారులు పాల్గొన్నారు.



