ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeతెలంగాణవిద్యుత్ తీగలు అమర్చి వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల అరెస్ట్

విద్యుత్ తీగలు అమర్చి వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల అరెస్ట్

📰 Generate e-Paper Clip

విద్యుత్ తీగలు అమర్చి వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురు నిందితుల అరెస్ట్

 

ఖానాపురం నవంబర్ 7 (నమస్తే భారత్) :

అడవి పందుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడంతో వ్యక్తి మృతికి కారణమైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం ఎస్ ఐ గుగులోత్ రామ్మోహాన్ తెలిపారు.
ఎస్ ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం మండలం మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన మంచే బాలరాజు (34) అక్టోబర్ 30, 2026న అదృశ్యమైనట్లు బాలరాజు భార్య సునిత ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు మనుబోతులగడ్డ శివారులోని సంగెం కాలువలో బాలరాజు మృతదేహం లభించింది.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని నెట్‌వర్క్ టవర్ డేటాను సేకరించి, అనుమానితులను గుర్తించి విచారించారు. విచారణలో బండమీదిమామిడి తండాకు చెందిన బోడ శ్రీను (35), జరుపుల శివాజీ (25), బోడ లక్‌పతి (30)లు నేరానికి పాల్పడినట్లు వెల్లడైంది. నిందితులు అక్టోబర్ 29న రాత్రి 7 గంటల సమయంలో ఎం.డి. రజాక్ వ్యవసాయ పొలం వద్ద అడవి పందుల కోసం సుమారు 100 మీటర్ల మేర బైండింగ్ వైరు ఏర్పాటు చేసి, సర్వీస్ వైరు ద్వారా విద్యుత్ సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. అదే రాత్రి అటుగా వెళ్తున్న మంచే బాలరాజు విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందినట్లు నిందితుల వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈమేరకు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించిన బైండింగ్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.అడవి జంతువుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం ప్రాణాంతకమని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని చట్టరిత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!