ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeఎడిటోరియల్హెచ్ పి వి టీకా తీసుకుందాం *క్యాన్సర్ ను నివారిద్దాం హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు

హెచ్ పి వి టీకా తీసుకుందాం *క్యాన్సర్ ను నివారిద్దాం హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

హెచ్ పి వి టీకా తీసుకుందాం *క్యాన్సర్ ను నివారిద్దాం

హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 22:మొగిలిగిద్ద కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు 8, 9 మరియు 10 వ తరగతి అమ్మాయిలకు హెచ్ పి వి వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించారు.హెచ్ పి విఅనగా ఉమెన్ పాపిలోమా వైరస్ అనే, చాలా సాధారణమైన వైరస్ అని, ఈ హెచ్ పి వి వైరస్ లో కొన్ని అధిక ప్రమాద రకాలు భవిష్యత్తులో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ను మరియు ఇతర క్యాన్సర్లకు కారణం అవుతాయని , ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కేసులలో దాదాపు 95 శాతం కంటే ఎక్కువ హెచ్ పి వి వైరస్ తో సంబంధం కలిగి ఉన్నాయని తెలియజేశారు. హెచ్పీవీ వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవాలి అంటే, హెచ్ పి వి సంక్రమణ మరియు దానివల్ల వచ్చే గర్భాశయం ముఖ ద్వారా క్యాన్సర్ ను నివారించడంలో అత్యంత ప్రభావంతమైన రక్షణ కలిగిస్తుంది అని, అందువలన ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి అని జె శ్రీనివాసులు చెప్పారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెచ్పీవీ వ్యాక్సిన్ క్లీన్ కాల్ ట్రయల్స్ పరీక్షించిన తర్వాత మరియు విస్తృత వినియోగంలో ఉన్న భద్రతా సమాచారాన్ని సమీక్షించగా, ఈ వ్యాక్సిన్ సురక్షితమైనది మరియు సమర్థవంతమైనది అని డబ్ల్యూ హెచ్ ఓ వారు పేర్కొన్నారని చెప్పారు. ఈ టీకా సాధారణ టీకా వేసిన ప్రదేశాలలో వేస్తారు. టీకా వేసినప్పుడు కొద్దిగా నొప్పి/వాపు, స్వల్ప జరము, అలసట లేదా తలనొప్పి వంటి తాత్కాలిక లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి కానీ ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను ప్రస్తుతము 14 సంవత్సరము నుండి 15 సంవత్సరంలోపు అమ్మాయిలు మాత్రమే తీసుకోవాలని తెలియజేశారు. ఈ టీకా భవిష్యత్తులో గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని, కాబట్టి హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి భయపడకుండా ఆరోగ్య సిబ్బంది చెప్పినట్లు సూచనలు పాటిస్తూ అందరూ తప్పకుండా హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవాలని,టీకా నేడు -ఆరోగ్యకరమైన భవిష్యత్తు రేపుఅని హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాస్ లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్.ఎమ్ పుష్పలత, కేజీబీవీ పాఠశాల స్టాఫ్ నర్స్ సంతోష, ఆశలు మరియు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!