ఖానాపురంలో ముమ్మరంగా మోరీల నిర్మాణ పనులు
- సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో పనుల పరిశీలన
ఖానాపురం ఆగష్టు21(నమస్తే భారత్ ) :
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఖానాపురం మండ కేంద్రంలో వీధుల వెంట వర్షపు నీరు నిల్వ ఉండకుండా సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో ముందస్తుగా మోరీల ఏర్పాటు పనులు చేపట్టారు.గ్రామంలోని పలు బజారులో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోతున్న ప్రాంతంలో జెసిబీ సహాయంతో మోరీల ఏర్పాటు పనులను ప్రారంభించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు కల్వర్టు పైపులు వేస్తున్నారు.
ఈ పనుల వల్ల రోడ్లపై నీరు నిలవడం, దోమల బెడద, రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు గుండ్లపల్లి విజయ్, అజహర్, కామిశెట్టి లక్ష్మీ సుధీర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



