బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రూ.5కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు

కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ ప్రారంభం
పేద కుటుంబాలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన నీటి సదుపాయం
బాల బ్రహ్మచారి సేవా కార్యక్రమాన్ని అభినందించిన హన్మంత్ రెడ్డి
పెద్ద ఎత్తున మహిళలు, కాలనీ వాసుల పాల్గొనిక
బాచుపల్లి, జూన్ 21 (నమస్తే భారత్):

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో పేద ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కాయిన్ ఆధారిత ఫిల్టర్ వాటర్ ప్లాంట్‌ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. బాల బ్రహ్మచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా కేవలం రూ.5 కాయిన్‌తో 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు పొందే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన తాగునీరు అందించే ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ కాలనీల్లో నివసించే కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. సమాజ సేవా దృక్పథంతో ఈ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన బాల బ్రహ్మచారిని ప్రత్యేకంగా అభినందించిన ఆయన, భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాల బ్రహ్మచారి, సత్యనారాయణ, నందకుమార్, దుర్గాప్రసాద్, నరేష్, అశోక్‌రావు, నరసింహ, మల్లేష్, రాజు, బాలకృష్ణ, సంతోష్, బద్రీనాథ్, రాము, శంకర్, సత్యవతి, నాగమణి, రజిత, రాములమ్మ, మంజుల, రోషమ్మ, దీపిక, సంజన తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందుబాటులోకి రావడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా రోజువారీ అవసరాలకు స్వచ్ఛమైన నీరు సులభంగా లభించనుండటంతో కాలనీలో ఆనంద వాతావరణం నెలకొంది.



