*ఎమ్మెల్యే వీర్లపల్లి తో సహా కాంగ్రెస్ అనుచరులకు 50 కోట్ల ముడుపులు*


*దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్*
*ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు*
*సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యర్యంలో షాద్ నగర్ చౌరస్తా లో ధర్నా*
*పాల్గొన్న బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, వంకాయల నారాయణ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్*
నమస్తే భారత్ షాద్ నగర్ జులై07:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలి (చౌరస్తా ) లో సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కు వ్యతిరేకంగా ఆందోళన, ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా లో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్య అతిధి గా పాల్గొని ధర్నా కు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదని దీనివల్ల రైతులు, చుట్టూ ప్రక్క గ్రామాలు, తండాలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. డంపింగ్ యార్డ్ వద్దని ప్రజలు ఆందోళన చేస్తుంటే ఎమ్మెల్యే గారు వచ్చి ఎట్టి పరిస్థితి లో అక్కడ డంపింగ్ యార్డ్ రాదని హామీ ఇచ్చారని మరి ఇప్పుడు ఏమైంది అని నిలదీశారు. వెంటనే 641 జీవో ను ఆపాలని లేకుంటే రాజీనామా చేయాలనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు హరీష్ రెడ్డి లను సిద్దాపూర్ కు తీసుకొని వచ్చి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని అన్నారు. బీజేపీ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నిన్ను ఎన్నుకున్నది మంచి పనులు చేస్తావని కానీ నువ్వు ఇక్కడ చెత్త తీసుకొని వచ్చి చెత్త ఎమ్మెల్యే అయ్యావని అన్నారు. ఈ ఆందోళన ఇక్కడిదాక ఆగదని డంపింగ్ యార్డ్ రద్దయ్యే వరకు కొనసాగుతుందని అన్నారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ మా ఊరు, మా మండలం అని ఎమ్మెల్యే గారు అన్నారని మరి ఇప్పుడు ఆ మాటలు ఎక్కడికి పోయాయాని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కడెంపల్లి శ్రీనివాస్, దేవేందర్ యాదవ్, కోస్గి శ్రీనివాస్, యుగంధర్, రామకృష్ణ, దినేష్, శివా చారి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



