ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeఎడిటోరియల్ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

📰 Generate e-Paper Clip

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బోడ ఎల్లయ్య

గూడూరు జూలై 7 (నమస్తే భారత్ ) :
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో
ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) 32 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహబూబాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బోడ ఎల్లయ్య జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు మరియు ఎమ్మార్పీఎస్ జెండా పండుగను పురస్కరించుకుని జూలై7న రాష్ట్ర వ్యాప్తంగాఎమ్మార్పీఎస్ జెండాలనుఆవిష్కరించుకోవడం ఆనవాయితీ అన్నారు. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ చేసిన ఉద్యమాలను గుర్తు చేశారు. మాదిగల సంక్షేమం కోసం,అభివృద్ధి కోసం ఎన్నో ఉధ్యమాలు చేసిన మహానీయుడు మంద కృష్ణ మాదిగ అనికొనియాడారు.జెండా పండుగను పురస్కరించుకుని స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గద్దల బాబు, హెచ్ శ్రీనివాస్ ,చప్పట్ల రాము , బోడ సూరయ్య , జేరిపోతుల సాంబయ్య , జనగం మహేష్ , నమిలి సాంబయ్య , ఎల్లంకి వినయ్ , గద్దల యాకయ్య ,చెరుకు రవీందర్ ,బోడ సాంబయ్య , ఇసారాం రాజేందర్ ,కోరే మోహన్ ,చిరుపెళ్లి అయోధ్య , పోలేపాక యాకయ్య ,తుల ముక్తీశ్వర్ , ఎల్లంకి మహేష్ ,బోడ సాయిరామ్ ,బోడ సాయి కృష్ణ ,సంతోష్ , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!