సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో
మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ కి
సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది
న్యాయమిత్ర:-మరిపెడ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక లో భాగంగా 14 వార్డులో బుధవారం జరిగిన సమావేశంలో మినీ స్టేడియం మరియు లైబ్రరీ గురించి సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సన్రైజ్ స్ట్రైక్ క్రికెట్ క్లబ్ మాట్లాడుతూ. మరిపెడ మున్సిపాలిటీ రోజురోజుకీ అంచలంచలుగా ఎదుగుతూ పెద్ద పట్టణాలకు దీటుగా నిలబడుతున్న తరుణంలో మున్సిపాలిటీకి ఒక క్రీడాస్థలం కూడా లేకపోవడం శోచనీయమని చుట్టుపక్కల అన్ని మండలాలు మరియు మున్సిపాలిటీలలో సౌకర్యవంతమైన స్టేడియాలు ఉన్నాయి. అలాంటిది మన మరిపెడ మున్సిపాలిటీకి క్రికెట్ స్థలం లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పోలీస్ శిక్షణ కి తయారయ్యే అభ్యర్థులు, క్రీడాకారులు, ఉదయపు నడక చేసేవారికి ,పెద్దలకు, పిల్లలకు క్రీడాస్థలం అవసరమని శారీరక ,మానసిక ఆరోగ్యానికి చాలా దోహదపడుతుందని అన్నారు . మినీ స్టేడియానికి స్థలాన్ని కేటాయించి దాని అభివృద్ధికి దోహదం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ కి మరియు కమిషనర్ కి విన్నవించడం జరిగింది. అలాగే పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులకు చదువుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని అందువలన ఒక గ్రంథాలయాన్ని అందుబాటులో తేవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సన్రైస్ క్రికెట్ క్లబ్ సభ్యులు బోడ రవి,అశోక్ ,దసరా, హరీష్, అన్వేష్, వెంకన్న, మరియు మరిపెడ స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

